రాష్ట్రంలో తీవ్ర విషాదం.. ఆరుగురు చిన్నారులు మృతి

by Vemula.Srinu Prasad |

రాష్ట్రంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది...

రాష్ట్రంలో తీవ్ర విషాదం.. ఆరుగురు చిన్నారులు మృతి
X

దిశ, వెబ్ డెస్క్: కర్నూలు జిల్లా(Kurnool District)లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. నీటికుంటలో స్నానానికి దిగి ఆరుగురు చిన్నారులు మృతి చెందారు. ఆస్పరి మండలం చింగిలి గ్రామంలో జరిగింది. గ్రామానికి చెందిన ఐదో తరగతి విద్యార్థులు నీటికుంటలో స్నానానికి దిగారు. అయితే ఒక్కసారిగా కుంటలో మునిగిపోయారు. స్థానికులు కాపాడే ప్రయత్నం చేసినా ఫలించలేదు. చిన్నారులు నీటిలో మునిగిపోవడంతో ఊపిరి తీసుకోలేకపోయారు. ఆరుగురు చిన్నారులు కూడా చనిపోయారు. విషయం తెలుసుకున్న పోలీసులు.. ఆరుగురు చిన్నారుల మృతదేహాలను బయటకు తీశారు. అనంతరం పోస్టుమార్టంకు తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరు అవుతున్నారు. వారిని ఆపడం ఎవరితరం కావడంలేదు. ఎంతో చలాకీగా ఉండే ఆరుగురు చిన్నారులు ఇక లేరని తెలిసి చింగిలి గ్రామస్తులు సైతం కంటతడి పెట్టుకున్నారు. ఈ ఘటనతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

Next Story