శ్రీరామనవమి వేళ రాష్ట్రంలో తీవ్ర విషాదం.. తుంగభద్ర నదిలో నలుగురు మృతి

by Vemula.Srinu Prasad |

శ్రీరామనవమి వేళ రాష్ట్రంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. తుంగభద్ర నదిలో ఈతకు వెళ్లి నలుగురు మృతి చెందారు. ..

శ్రీరామనవమి వేళ రాష్ట్రంలో తీవ్ర విషాదం.. తుంగభద్ర నదిలో నలుగురు మృతి
X

దిశ, వెబ్ డెస్క్: శ్రీరామనవమి(Sri Rama Navami) వేళ రాష్ట్రంలో తీవ్ర విషాదం(Tragedy) చోటు చేసుకుంది. తుంగభద్ర నది(Tungabhadra River)లో ఈతకు వెళ్లి నలుగురు మృతి చెందారు. మృతుల్లో ఇద్దరు యువకులు కాగా ఇద్దరు మహిళలు ఉన్నారు. సరదాగా నదిలో ఈతకు వెళ్లి అనంతలోకానికి వెళ్లిపోవడంతో స్థానికంగా విషాదచాయలు అలుముకున్నాయి. నదిలో తొలుత ఇద్దరు దిగినట్లు తెలుస్తోంది. ప్రమాదవశాత్తు వీరు మునిగిపోవడంతో మరో ఇద్దరు కాపాడేందుకు ప్రయత్నం చేసినట్లు సమాచారం.

ఈ క్రమంలో..

అయితే ఈ క్రమంలో నలుగురు కూడా నదిలో మునిగిపోయి ఊపిరాడక మృతి చెందినట్లు తెలుస్తోంది. ఇక విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతులు కర్ణాటకలోని కురిడి గ్రామ వాసులుగా గుర్తించారు. నలుగురు మృతదేహాలు బయటకు తీసి పోస్టుమార్టంకు తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Next Story