అల్లూరి జిల్లాలో తీవ్ర విషాదం.. వాగులో ఈతకు వెళ్లి ముగ్గురు బాలురు మృతి

by Vemula.Srinu Prasad |   (  Updated:2026-04-12 11:44:15  IST  )

అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఆదివారం తీవ్ర విషాదం చోటు చేసుకుంది. సరదాగా ఈతకు వెళ్లిన ముగ్గురు బాలురు వాగులో మునిగి ప్రాణాలు కోల్పోయారు.

అల్లూరి జిల్లాలో తీవ్ర విషాదం.. వాగులో ఈతకు వెళ్లి ముగ్గురు బాలురు మృతి
X

దిశ, వెబ్ డెస్క్: అల్లూరి సీతారామరాజు జిల్లా(Alluri Sitharamaraju District)లో ఆదివారం తీవ్ర విషాదం(Tragedy) చోటు చేసుకుంది. సరదాగా ఈతకు వెళ్లిన ముగ్గురు బాలురు(Boys) వాగు(Stream)లో మునిగి ప్రాణాలు కోల్పోయారు. ఎండ తీవ్రత నుంచి ఉపశమనం కోసం సరదాగా గడుపుదామని పెదబయలు మండలం పర్రెడ గ్రామ సమీపంలోని మత్స్యవాగు వద్దకు హర్షిత్ (10), శ్రీను (10), మరియు ప్రదీప్ (9) వెళ్లారు. నీటిలోకి దిగిన ఆ చిన్నారులు లోతు అంచనా వేయలేక మృత్యువాత పడ్డారు.

రక్షించే ప్రయత్నం చేసినా....

అయితే నీటిలో మునిగిపోతున్న బాలురను గమనించిన స్థానికులు రక్షించే ప్రయత్నం చేశారు. కానీ ఫలితం లేకుండా పోయింది. అప్పటికే ముగ్గురు బాలురు ఊపిరి ఆడక మృతి చెందారు. ఆడుకోవాల్సిన వయసులో విధి ఆడిన వింత నాటకానికి ముగ్గురు చిన్నారులు బలికావడంతో పర్రెడ గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. తమ కళ్లముందే ఆడుకుంటూ వెళ్లిన బిడ్డలు విగతజీవులుగా పడి ఉండటం చూసి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Next Story