బాలికపై అత్యాచారం.. నిందితుడి హోటల్ ధ్వంసం

by Vemula.Srinu Prasad |   (  Updated:2025-06-29 14:38:21  IST  )

ప్రకాశం జిల్లాలో బాలికపై అత్యాచారం జరిగింది...

బాలికపై అత్యాచారం.. నిందితుడి హోటల్ ధ్వంసం
X

దిశ, వెబ్ డెస్క్: ప్రకాశం జిల్లా(Prakasam District)లో బాలికపై అత్యాచారం జరిగింది. కొమరోలు మండలం తాటిచర్లకు చెందిన యువకుడు చంద్రశేఖర్.. బాలికకు మాయ మాటలు చెప్పి అఘాయిత్యానికి పాల్పడ్డారు. దీంతో పోలీసులకు బాలిక తల్లి ఫిర్యాదు చేశారు. ఈ మేరకు చంద్రశేఖర్‌పై పోక్సో కేసు నమోదు చేశారు. అయితే నిందితుడికి సంబంధించిన హోటల్‌ను గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. ఈ ఘటనపైనా పోలీసులు కేసు నమోదు చేశారు. బాలికకు చెందిన బంధువులే చేసి ఉంటారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆ కోణంలోనూ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Next Story