- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
6 కిలోమీటర్ల డోలీ ప్రయాణం.. అయినా దక్కని ప్రాణం
అల్లూరి జిల్లా ఏజెన్సీ ప్రాంతంలో రడ్డు సదుపాయం లేక బాలిక మృతి చెందారు...

దిశ, వెబ్ డెస్క్: ప్రభుత్వాలు మారుతున్నా గిరిజన ప్రాంతాల్లో పరిస్థితులు మారడంలేదు. ఆధునిక కాలంలో కూడా అవే కష్టాలు తప్పడం లేదు. చాలా ఏళ్లుగా సదుపాయాలు, సౌకర్యాలు లేక గిరిజనులు(Tribes) వెనకబడిపోయే ఉన్నారు. ఇప్పటికీ ఆ అవస్థలే వారిని వెంటాతున్నాయి. ఏదైనా అవసరం నిమిత్తం పట్టణ ప్రాంతాలకు వెళ్లాలంటే రహదారులు(Roads)సరిగాలేక ఇంకా నానా తంటాలు పడుతున్నారు. ఇక హెల్త్ ఎమర్జెన్సీ వస్తే ప్రాణాలపై ఆశలు వదులుకోవాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. తాజాగా ఇలాంటి ఘటన అల్లూరి జిల్లా ఏజెన్సీ ప్రాంతంలో జరిగింది. సులిపకన్ ప్రాంతానికి చెందిన చిట్టం జ్యోతి ఒక్కసారిగా కళ్లు తిరిగి పడిపోయారు. దీంతో స్థానికులు 108 అంబులెన్స్ కు సమాచారం అందించారు.
అంబులెన్స్ సమాచారమిచ్చినా..
అయితే రోడ్డు సౌకర్యం సరిగాలేక అంబులెన్స్ రాలేదు. దీంతో జ్యోతిని డోలీ(Dolly)లో తరలించారు. దాదాపు 6 కిలో మీటర్లు డోలీని మోసుకుంటూ మజ్జివలస ఆస్పత్రికి తీసుకెళ్లేందుకు ప్రయత్నం చేశారు. కానీ దురదృవశాత్తు జ్యోతి మార్గమధ్యలోనే మృతి చెందారు. దీంతో స్థానికులు, మృతురాలి బంధువులు ఆందోళనకు దిగారు. జ్యోతి కుటుంబానికి రూ.10 లక్షల పరిహారం అందించాలని డిమాండ్ చేశారు. అలాగే గిరిజన గ్రామాలకు రహదారి సదుపాయం కల్పించాలన్నారు. ఎన్ని ప్రభుత్వాలు మారుతున్నా తమ గ్రామ పరిస్థితులు మాత్రం మారడంలేదని, ఇప్పటికైనా అన్ని సదుపాయాలు కల్పించాలని సులిపకన్ డిమాండ్ చేశారు.






