- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పిల్లలను ఎత్తుకెళ్లి అమ్ముకుంటున్న ముఠా అరెస్ట్.. ముగ్గురిని రక్షించిన పోలీసులు
కొంతకాలంగా విజయవాడ నగరంతో పాటు చిన్న ప్రాంతాల నుంచి శిశువులను కొందరు దుండగులు ఎత్తుకెళ్లి అమ్ముకుంటారు..

దిశ, వెబ్ డెస్క్: కొంతకాలంగా విజయవాడ(Vijayawada) నగరంతో పాటు ఇతర ప్రాంతాల నుంచి శిశువులను కొందరు దుండగులు ఎత్తుకెళ్లి అమ్ముకుంటారు. పలువురు ఫిర్యాదులు చేసిన నేపథ్యంలో కేసులు మిస్టరీగా మారింది. కేసును సీరియస్‌గా తీసుకున్న పోలీసులు బృందాలుగా విడిపోయి గాలించారు. చివరకు ఐదుగురు సభ్యుల ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే ఈ ముఠా వెనుక మహిళ ఉండటం చర్చగా మారింది.
విజయవాడ సితార సెంటర్‌కు చెందిన మహిళ.. మరో ఐదుగురు సభ్యులతో కలిసి కొంతకాలంగా ఆస్పత్రులు, రైల్వే స్టేషన్‌లో నిద్రిస్తున్న వారి నుంచి చిన్నారులను అపహరించి అమ్ముకుంటున్నారు. దీంతో బాధితులు స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేసిన టాస్క్ ఫోర్స్ పోలీసులకు కీలక సమాచారం అందింది. దీంతో పక్క ప్లాన్‌తో ఐదుగురు నిందితులను అరెస్ట్ చేశారు. వారి నుంచి ముగ్గురు శిశువులను రక్షించారు. తల్లిదండ్రులకు అప్పగించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.
మరోవైపు ఐదుగురు నిందితులను రహస్యంగా ప్రశ్నిస్తున్నారు. ‘‘ఎక్కడ, ఎప్పుడు, ఎంతమంది శిశువులను అపహరించారు..? ఎవరెవరికి అమ్మారు. చిన్నారుల అపహరణ వెనుక ఇంకా ఎంతమంది ఉన్నారు.’’ అనే కోణంలో విచారిస్తున్నారు.






