- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Breaking: మళ్లీ అదే తరహా ఘటన.. ఆందోళనలో వైసీపీ నాయకులు
గుంటూరు జిల్లా తాడేపల్లిలో వైఎస్సార్ సీపీ కార్యాలయంలో అగ్నిప్రమాదం కలకలం రేగింది..

దిశ, వెబ్ డెస్క్: గుంటూరు జిల్లా(Guntur) తాడేపల్లి(Tadepalli)లో వైఎస్సార్ సీపీ(Ysrcp) కార్యాలయం సమీపంలో అగ్నిప్రమాదం(Fire Accident) కలకలం రేగింది. అక్కడ ఉన్న గ్రీనరీకి గుర్తు తెలియని వ్యక్తులు నిప్పుపెట్టారు. దీంతో వైసీపీ కార్యాలయం సిబ్బంది అలర్ట్ అయింది. ఫైర్ సిబ్బందికి ఫోన్ చేశారు. ఘటన స్థలానికి చేరుకున్న ఫైర్ ఇంజిన్లు మంటలను అదుపు చేశాయి. అయితే ఇదే తరహా ఘటనలు గతంలోనూ రెండు సార్లు జరిగాయి. ఇప్పుడు మళ్లీ జరగడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పదే పదే ఘటనలు పునరావృతం కావడంతో అటు వైసీపీ నాయకులు ఆందోళన చెందుతున్నారు. ఈ మేరకు తాడేపల్లి పోలీస్ స్టేషన్‌లో వైసీపీ నాయకులు ఫిర్యాదు చేశారు. గతంలోనూ ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పుడు సైతం వైసీపీ నేతలు చేసిన ఫిర్యాదును స్వీకరించారు. స్థానిక సీసీ టీవీ పుటేజులను పరిశీలిస్తున్నారు. అసలు అక్కడే ఎందుకు గ్రీనరికీ నిప్పు పెడుతున్నారనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.






