Breaking: అమరావతిలో అగ్నిప్రమాదం.. ఎగిసి పడుతున్న మంటలు

by Vemula.Srinu Prasad |

అమరావతి వెలగపూడి ఎన్‌నైన్ జంక్షన్ దగ్గర అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది.....

Breaking: అమరావతిలో అగ్నిప్రమాదం.. ఎగిసి పడుతున్న మంటలు
X

దిశ, వెబ్ డెస్క్: అమరావతి వెలగపూడి ఎన్‌నైన్ జంక్షన్(Amaravati Velagapudi N9 Junction) దగ్గర అగ్ని ప్రమాదం(Fire Accident) చోటు చేసుకుంది. ఎల్అండ్‌టీ సంస్థ(L&T Company)లో మంటలు ఎగిసిపడుతున్నాయి. భారీ శబ్ధంతో ప్లాస్టిక్ పైపులు(Plastrict Pipes) తగలబడుతున్నాయి. పరిసరాల్లో నల్లని పొగలు అలుముకున్నాయి. దీంతో స్థానికులు భయాందోళకు గురయ్యారు. ఫైర్ సిబ్బందికి వెంటనే సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకుని మంటలార్పుతున్నారు. షార్ట్ సర్యూట్ వల్లే ప్రమాదానికి కారణంగా అంచనా వేశారు. అటు పోలీసులు సైతం ఘటనా స్థలానికి చేరుకుని మంటలార్పే ప్రయత్నం చేస్తున్నారు.

Next Story