- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బాపట్ల జిల్లాలో ఘోర ప్రమాదం... ముగ్గురు దుర్మరణం
by Vemula.Srinu Prasad |
బాపట్ల జిల్లా యాజిలి దగ్గర ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది....

X
దిశ, వెబ్ డెస్క్: బాపట్ల జిల్లా యాజిలి దగ్గర ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అదుపు తప్పి ట్రాక్టర్ బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. పలువురికి గాయాలు కావడంతో ఆస్పత్రికి తరలించారు. నిజాంపట్నం నుంచి బాపట్ల వెళ్తుండగా ప్రమాదం జరిగింది. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. ప్రమాదనికి గల కారణాలను తెలుసుకున్నారు. ట్రాక్టర్ అతివేగమే కారణంగా ప్రాథమికంగా అంచనా వేశారు. మృతుల మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. వాహనాలు నడిపే సమయంలో డ్రైవర్లు కుటుంబసభ్యులను దృష్టిలో ఉంచుకోవాలని పోలీసులు సూచించారు. అతివేగంగా వాహనాలు నడపొద్దన్నారు. మద్యం తాగి వాహనాలు నడిపితే కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు.
Next Story






