- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Ap: జలపాతానికి వెళ్తుండగా ఘోరం.. ముగ్గురు స్పాట్ డెడ్
కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది...

దిశ, వెబ్ డెస్క్: కాకినాడ జిల్లా(Kakinada) ప్రత్తిపాడు నియోజకవర్గంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రత్తిపాడు మండలం ఒమ్మంగి గోపాల చెరువు(Ommangi Gopala pond) వద్ద అదుపుతప్పి టెంపో వాహనం(Tempo vehicle) బోల్తా కొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందగా పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. దీంతో క్షతగాత్రులను ప్రత్తిపాడు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. కాకినాడ నుండి దారపల్లి జలపాతం(Water Fall)కు వెళుతుండగా ప్రమాదం జరిగినట్లు గుర్తించారు. మృతుల వివరాలు సేకరించారు. మృతదేహాలను పోస్టుమార్టంకు తరలించారు. అతివేగమే ప్రమాదానికి కారణంగా ప్రాథమికంగా అంచనా వేశారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
రాష్ట్రంలో పండగపూట తీవ్ర విషాదం చోటు చేసుకుంది. మూడు చోట్ల మొత్తం తొమ్మిది మంది వరకూ చనిపోయారు. సరదాగా భోగి, సంక్రాంతి, కనుమ జరుపుకుని గంటలు గడవకముందే మృత్యువు వెంటాడింది. సముద్రస్నానానికి వెళ్లి వేర్వేరు చోట్ల ఆరుగుతు చనిపోగా.. కాకినాడ జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మరో ముగ్గురు దుర్మరణం చెందారు. దీంతో ఈ ఘటనలు స్థానికంగా అందర్నీ కలిచివేసింది. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదని, కాబట్టి ప్రతిఒక్కరూ రోడ్డు ప్రయాణాలు, విహారయాత్రల పట్ల అప్రమత్తంగా ఉండాలని, అవసరమైతే నిపుణులను వెంట పెట్టుకెళ్లాలని పలువురు మానవతావాదులు అంటున్నారు.






