Kanigiri: నడిరోడ్డుపై తాగుబోతు పుష్పరాజ్ హల్ చల్

by Vemula.Srinu Prasad |   (  Updated:2025-01-22 11:30:49  IST  )

ప్రకాశం జిల్లా కనిగిరిలో నడిరోడ్డుపై తాగుబోతు హల్ చల్ చేశారు..

Kanigiri: నడిరోడ్డుపై తాగుబోతు పుష్పరాజ్ హల్ చల్
X

దిశ, వెబ్ డెస్క్: హీరో అల్లు అర్జున్(Hero Allu Arjun) నటించిన ‘పుష్పా’(Puspa) సినిమా డైలాగులు ప్రతి ఒక్కరికి ఎక్కేశాయి. చిన్నలు, పెద్దలు ఎక్కడ చూసినా తగ్గేదేలే అని అంటున్నారు. సీరియస్ అయినా కామెడీ అయిన ‘పుష్పా’ డైలాగులు చెబుతున్నారు. ఇప్పుడు వీరి బాటలోకి తాగుబోతులు కూడా చేరిపోయారు. ఫూటుగా మద్యం కొట్టి నడిరోడ్లపై తగ్గేదేలే అని అంటున్నారు. ప్రకాశం జిల్లా కనిగిరిలో ఓ తాగుబోతు చేసిన హాంగామా అంతా ఇంతా కాదు. కత్తిని పట్టుకుని నడిరోడ్డుపై కలకలం సృష్టించారు. కత్తిని నోటిలో పెట్టుకుని ‘నేనే పుష్పరాజ్’ అంటూ హల్ చల్ చల్ చేశారు. కత్తితో గాయం చేసుకుని ఇది తన బ్రాండ్ అంటూ వీరంగం సృష్టించారు. అంతేకాదు కత్తిని చూపుతూ రోడ్డుపై వెళ్లే వారిని భయబ్రాంతులకు గురి చేశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.

Next Story