మళ్లీ వస్తా.. ఇదే ప్లేసులో పుల్ బాటిల్ తాగుతా: నడిరోడ్డుపై మందు బాబు హల్ చల్

by Vemula.Srinu Prasad |

తిరుపతి జిల్లా శ్రీకాళహస్తిలో నడిరోడ్డుపై ఓ మందు హల్ చల్ చేశారు...

మళ్లీ వస్తా.. ఇదే ప్లేసులో పుల్ బాటిల్ తాగుతా: నడిరోడ్డుపై మందు బాబు హల్ చల్
X

దిశ, వెబ్ డెస్క్: తిరుపతి జిల్లా(Tirupati District) శ్రీకాళహస్తి(Srikalahasti)లో ఓ మందు హల్ చల్ చేశారు. తనకు మించినోళ్లు లేరంటూ రెచ్చిపోయారు. మందు తాగడానికి వైన్ షాపు(Wine Shop)లో సిట్టింగ్ రూం లేకపోవడంతో మందుబాబు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేవారు. సిట్టింగ్ రూములు లేవని నడిరోడ్డుపై మందు బాటిల్‌తో నిరసన వ్యక్తం చేశారు. ఉన్న చోటనే కూర్చుని మందు తాగుతానని, తన ఇష్టమంటూ రోడ్డుపైనే బైఠాయించారు. తాగడానికి సిట్టింగ్ రూం పెట్టరా అని ప్రశ్నించారు. మళ్లీ వస్తా ఫుల్ బాటిల్ తెచ్చుకుంటానని, ఇదే ప్లేస్‌లో తాగుతానని, ఎవరు ఏం చేస్తారో చేయండంటూ హల్ చల్ చేశారు. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.

Next Story