లాజిస్టిక్స్ చాలా ముఖ్యం.. అసెంబ్లీలో సీఎం కీలక వ్యాఖ్యలు

by Vemula.Srinu Prasad |

రాష్ట్రాభివృద్ధిపై అసెంబ్లీలో చర్చి జరిగింది...

లాజిస్టిక్స్ చాలా ముఖ్యం.. అసెంబ్లీలో సీఎం కీలక  వ్యాఖ్యలు
X

దిశ, వెబ్ డెస్క్: రాష్ట్రాభివృద్ధిపై అసెంబ్లీ(Assebmly)లో చర్చి జరిగింది. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు నాయుడు(Cm Chadrababu) మాట్లాడుతూ రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే లాజిస్టిక్స్(Logistics) చాలా ముఖ్యమని చెప్పారు. లాజిస్టిక్స్‌లో రోడ్డు రవాణా సైతం చాలా కీలకమన్నారు. జల రవాణా(Water transport) మార్గం ద్వారా సరకు రవాణాకు చాలా తక్కువ ఖర్చు అవుతుందని తెలిపారు. రాష్ట్రానికి 960 కి.మీ సముద్ర తీరం ఉండటం చాలా ఉపయోగకరమని చెప్పారు. రోడ్డు మార్గం ద్వారానే 41 శాతం సరుకు రవాణా జరుగుతోందన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో లాజిస్టిక్స్‌కు ప్రాధాన్యం ఇస్తున్నట్లు చంద్రబాబు స్పష్టం చేశారు. జగన్ హయాంలో రోడ్లన్నీ అధ్వాన్నంగా మారాయని తెలిపారు. రోడ్లపై గుంతలు లేకుండా చేస్తామని హామీ ఇచ్చామని, ఆ మాట నిలబెట్టుకున్నామన్నారు. దేశంలో ఏపీనే మౌలిక వసతుల కల్పన ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టిందని పేర్కొన్నారు.

Next Story