వెల్లంపల్లి వర్సెస్ బోండా ఉమా.. బాహుబలి‌లో ప్రభాస్‌? అత్తారింటికి దారేదిలో పవన్‌?

by Disha Web Desk 14 |
వెల్లంపల్లి వర్సెస్ బోండా ఉమా.. బాహుబలి‌లో ప్రభాస్‌? అత్తారింటికి దారేదిలో పవన్‌?
X

దిశ, డైనమిక్ బ్యూరో: టీడీపీ సీనియర్ నేత బోండా ఉమా, వైసీపీ నేత మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ మధ్య గత కొద్దిరోజులుగా డైలాగ్ వార్ నడుస్తోంది. ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో వీరి మాటల యుద్దం హాట్ టాపిక్‌గా మారింది. నిన్న (ఆదివారం) విజయవాడలో జరిగిన ఆర్యవైశ్యుల ఆత్మీయ సమ్మేళనానికి వెల్లంపల్లి శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వెల్లంపల్లి మాట్లాడుతూ.. నన్ను చంపుతానని బోండా ఉమా మాట్లాడుతున్నారు, నేను టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన చీఫ్ పవన్ కల్యాణ్‌కే భయపడను.. అలాంటిది బోండా ఉమా ఎంత అని కీలక వ్యాఖ్యలు చేశారు. బోండా ఉమ ఒకటి తిడితే.. నేను రెండు తిడతానని వార్నింగ్ ఇచ్చారు.

వెల్లంపల్లి వ్యాఖ్యలపై బోండా ఉమా స్పందించారు. ఒకే ఒక్క తొక్కు తొక్కానంటే పాతాళానికి వెళ్తావ్ అని బోండా ఉమ ఫైర్ అయ్యారు. తాను పశ్చిమ నియోజకవర్గం నుంచి వచ్చి ఏదో నాలుగు ఓట్లు సంపాదించాలని జగన్ తన నియోజకవర్గానికి పంపినట్లు వివరించారు. బోండా ఉమాను లేపేస్తా.. తాట తీస్తా.. సూర్యుడిని, చంద్రుడిని చూపిస్తా అంటున్నావ్.. ఏంట్రా నువ్వు చూపించేది.. అని ఫైర్ అయ్యారు. నువ్వేమైనా బాహుబలి లో ప్రభాస్ అనుకుంటున్నావా? అత్తారింటికి దారేదిలో పవన్ కళ్యాణ్ అనుకుంటున్నావా? అని విమర్శించారు. నువ్వెంత నీ బతుకెంత? కరెక్ట్‌గా కొలిస్తే నా నడుముదాక రావని విమర్శించారు.

Read More..

సీఎం జగన్ ఈ మూడు సీట్ల పై సీరియస్ గా కసరత్తు!

Next Story

Most Viewed