సీఎం జగన్ ఈ మూడు సీట్ల పై సీరియస్ గా కసరత్తు!

by Mamatha |
AP News CM Jagan Lays The Foundation Stone For Apache Company
X

దిశ, ప్రతినిధి : వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ప్రతిపక్ష నాయకులను ఓడించడమే లక్ష్యంగా నిర్దేశించుకున్నారు. కుప్పంలో చంద్ర బాబు నాయుడును,మంగళగిరిలో నారా లోకేష్‌ను,పవన్ కళ్యాణ్‌ను ఓడించాలని జగన్ భావిస్తున్నారు.రిపోర్టుల ప్రకారం ఈ సీట్లపై జగన్ సీరియస్ గా కసరత్తు చేస్తున్నారు. కుప్పంలో భారీ బహిరంగ సభకు హాజరైన జగన్, చంద్రబాబుపై విరుచుకుపడ్డారు. తన ప్రభుత్వ సంక్షేమ పథకాలను చూసి కుప్పంలో చంద్రబాబును ఓడించాలని పిలుపునిచ్చారు.జగన్ ఇప్పటి వరకు మంగళగిరిలో ముగ్గురు ఇన్‌ఛార్జ్‌లు మార్చారు. లోకేశ్‌ను ఓడించేందుకు జగన్ నిరంతరం వివిధ సర్వే నివేదికలు తీసుకుంటూ మంగళగిరి అభ్యర్థులను మారుస్తున్నారని చెబుతున్నారు.

పవన్ కళ్యాణ్, భీమవరం, లేదా పిఠాపురంలో పోటీ చేయడం ఖాయం కానప్పటికీ, జగన్ కూడా పవన్ నియోజకవర్గాల్లో దేనిలోనైనా పోటీ చేస్తే ఓడించడానికి తీవ్రంగా కృషి చేస్తున్నట్లు చెబుతున్నారు. పవన్ పై పోరాటానికి జగన్ ఇప్పటికే గోదావరి జిల్లాల నుంచి కాపు నేతలను లాగడం మొదలుపెట్టారు. విపక్షాలకు చెందిన కీలక నేతలను వారి వారి నియోజకవర్గాలకే పరిమితం చేస్తున్నట్లు కనిపిస్తోంది. చంద్రబాబునాయుడు,లోకేష్,పవన్‌లకు వ్యతిరేకంగా జగన్ వ్యూహం మరియు ప్రణాళిక ఫలిస్తాయా? అనేది ప్రస్తుతానికి మిలియన్ డాలర్ల ప్రశ్న.

Next Story

Most Viewed