రూ.20 లక్షల ప్యాకేజీతో జాబ్ వస్తే.. అభిషేకం చేయిస్తా: దేవుడికే ఆఫర్ ఇచ్చిన భక్తుడు

by Vemula.Srinu Prasad |

ఓ భక్త విద్యార్థి కోరిక ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది. పరీక్షల్లో మంచి మార్కులతో పాటు సంవత్సరానికి రూ. 20 లక్షల ప్యాకేజీతో జాబ్ వచ్చేలా చేయాలని కోరుకున్నారు...

రూ.20 లక్షల ప్యాకేజీతో జాబ్ వస్తే.. అభిషేకం చేయిస్తా: దేవుడికే ఆఫర్ ఇచ్చిన భక్తుడు
X

దిశ, వెబ్ డెస్క్: ఓ భక్త విద్యార్థి కోరిక ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది. పరీక్షల్లో మంచి మార్కులతో పాటు సంవత్సరానికి రూ. 20 లక్షల ప్యాకేజీతో జాబ్ వచ్చేలా చేయాలని, అలా చేస్తే అభిషేకం చేయించడంతో పాటు పట్టు వస్త్రాలు సమర్పిస్తానని భద్రకాళి సమేత వీరభద్ర స్వామికి కోరుకున్నారు. ఇది తన మొదటి కోరిక అని తప్పకుండా తీర్చి తనను దీవించాలని విజ్ఞప్తి చేశారు. ఈ విషయం ఆలయం హుండీ లెక్కింపులో బయట పడింది. హుండీ నగదును లెక్కిస్తుండగా ఓ లేఖ లభ్యమయింది. లేఖను చదివిన అర్చకులు ఆశ్చర్యపోయారు. విద్యార్థి ఎవరోగాని దేవుడికే ఆఫర్ ప్రకటించడంపై ‘‘అమ్మ బడవా’’ అని నవ్వుకున్నారు. ఈ ఘటన ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మండలం తాడువాయి శివాలయంలో జరిగింది.

Next Story