‘ఇదేం భక్తి అక్కా’.. కర్పూరం వెలిగించి దేవుడి హుండీలో వేసేసింది!

by Gantepaka Srikanth |

కోరికలు నెరవేరాలని దేవుడి హుండీలో భక్తులు కానుకలు సమర్పిస్తుంటారు.

‘ఇదేం భక్తి అక్కా’.. కర్పూరం వెలిగించి దేవుడి హుండీలో వేసేసింది!
X

దిశ, వెబ్‌డెస్క్: కోరికలు నెరవేరాలని దేవుడి హుండీలో భక్తులు కానుకలు సమర్పిస్తుంటారు. కానీ ఓ భక్తురాలు మాత్రం ఇందుకు భిన్నంగా ప్రవర్తించింది. కర్పూరం వెలిగించి దేవుడి హుండీలో వేసింది. ఈ ఘటన ఆంధ్రప్రదేశ్‌లోని పిఠాపురం(Pithapuram)లో చోటుచేసుకుంది. హుండీ నుంచి పొగలు రావడం గమనించిన ఆలయ సిబ్బంది వెంటనే నీళ్ళు పోసి మంటలను ఆర్పారు. అప్పటికే కొన్ని నోట్లు కాలిపోయాయి. మిగిలిన నోట్లను పక్కకు తీసి హెయిర్ డ్రయర్ తో ఆరబెట్టారు. ఈ ఘటనతో అక్కడున్న వారంతా షాకయ్యారు. వీడియో

Next Story