- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కాళీదేవి, వీరభద్రస్వామి ప్రేమ వ్యవహారం.. పిడకలతో కొట్టుకున్న కైరుప్ప గ్రామస్తులు
ఓ ప్రేమ వ్యవహారంలో తలెత్తిన వివాదం వందల ఏళ్లు గడుస్తున్నా కొనసాగుతోంది...

దిశ, వెబ్ డెస్క్: ఓ ప్రేమ వ్యవహారంలో తలెత్తిన వివాదం వందల ఏళ్లు గడుస్తున్నా కొనసాగుతోంది. ఇద్దరు ప్రేమించుకోవడం వల్ల ఆ గ్రామం ఇప్పటికీ సమరానికి సై అంటుంది. ప్రతి సంవత్సరం అదే రోజును గుర్తు పెట్టుకుని మరీ పిడకలు రువ్వుకుంటున్నారు. ఈ రోజు కూడా పిడకల సమరం జరిగింది. చివరకు పంచాయితీ సుఖాంతం అయింది. ఈ ఘటన కర్నూలు జిల్లా ఆస్పరి మండలం కైరుప్పలో జరిగింది.
అసలు కథ ఇదీ..!
కైరుప్పలో కాళీ దేవి, వీరభద్రస్వామి కొన్ని శతాబ్ధాల క్రితం ప్రేమించుకున్నారు. అయితే పెళ్లిపై వీరభద్రస్వామి మాటతప్పడంతో కాళీదేవి ఆగ్రహించారు. వీరభద్రస్వామి వర్గీయులపై పిడకలతో దాడి చేశారు. దీంతో వారు సైతం ఎదురుదాడికి దిగారు. చివరకు ఈ పంచాయితీ పెద్దల వద్దకు చేరింది. కాళీదేవి, వీరభద్రస్వామితో మాట్లాడి ఇద్దరికీ వివాహం జరిపించారు. అయితే పిడకల సమరం జరగడం వల్లే వారి ప్రేమ వివాహం విజయవంతమైందని గ్రామస్తులు నమ్మకం పెట్టుకున్నారు. అప్పటి నుంచి ఈ ఆనవాయితీని కొనసాగిస్తున్నారు. ఉగాది జరిగిన తర్వాత రోజునే పిడకల సమరాన్ని ఉత్సవంగా జరుపుకుంటున్నారు. ఆలయంలో పూజలు చేసిన అనంతరం గ్రామస్తులు రెండు వర్గాలుగా విడిపోయి ఒకరిపై ఒకరు పిడకలు రువ్వుకుంటున్నారు.
ఈ రోజు కూడా కైరుప్పలో పిడకల సమరం జరిగింది. దెబ్బలు తగలకుండా ముఖానికి ముసుగులు, తలకు తుండుగుడ్డ కట్టుకున్నారు. ఈ సమరంలో ఎవరికైనా దెబ్బలు తగిలితే వీరభద్రస్వామి కుంకుమను గాయాలపై రాసుకున్నారు. ఇలా పిడకల సమరం ఈ ఏదాడికి ముగిసింది.






