తిరుమల క్షేత్రపాలకుడికి వేడుకగా అభిషేకం

by Vemula.Srinu Prasad |

తిరుమల గోగర్భం సమీపంలోని రుద్రుని రూపమైన క్షేత్రపాలకుడికి వేడుకగా అభిషేకం నిర్వహించారు...

తిరుమల క్షేత్రపాలకుడికి వేడుకగా అభిషేకం
X

దిశ, వెబ్ డెస్క్: తిరుమల గోగర్భం(Tirumala Gogarbha) సమీపంలోని రుద్రుని రూపమైన క్షేత్రపాలకుడికి వేడుకగా అభిషేకం నిర్వహించారు. తిరుమల క్షేత్రానికి పాలకుడిగా ఉన్న రుద్రునికి మహాశివరాత్రి(Mahashivratri) సందర్భంగా ప్రతి ఏటా అభిషేకం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ఈ నేపథ్యంలో శ్రీవారి ఆలయం నుంచి ఆలయ మర్యాదలతో అధికారులు, అర్చకులు క్షేత్రపాలక శిల వద్దకు చేరుకున్నారు. పాలు, పెరుగు, చందనం, పన్నీరు, కొబ్బరినీళ్లు తదితర ద్రవ్యాలతో విశేషంగా అభిషేకం చేశారు. ఆ తర్వాత నైవేద్యం సమర్పించారు. భక్తులకు ప్రసాదాలు పంపిణీ చేశారు.

Next Story