వైసీపీ నేత కేతిరెడ్డి పెద్దారెడ్డిపై కేసు నమోదు

by Vemula.Srinu Prasad |

అనంతపురం జిల్లా తాడిపత్రి వైసీపీ మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిపై కేసు నమోదు అయింది..

వైసీపీ నేత కేతిరెడ్డి పెద్దారెడ్డిపై కేసు నమోదు
X

దిశ, వెబ్ డెస్క్: అనంతపురం జిల్లా తాడిపత్రి వైసీపీ మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిపై కేసు నమోదు అయింది. పీపీపీ విధానం ద్వారా రాష్ట్రంలో ఏర్పాటు కాబోతున్న మెడికల్ కాలేజీల నిర్మాణాన్ని వ్యతిరేకిస్తూ తాడిపత్రిలో ర్యాలీ నిర్వహించేందుకు ఆయన ప్రయత్నం చేశారు. అయితే ర్యాలీకి అనుమతిలేదని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో అక్కడ కొద్దిసేపు ఉద్రిక్తత చోటు చేసుకుంది. దీంతో పెద్దారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులు, టీడీపీ నేతల తీరును తప్పుబట్టారు. ఈ ఘటనపై సీరియస్ అయిన పోలీసులు.. పెద్దారెడ్డిపై 296, 79, 351(2), 351(3) సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.

Next Story