ఎస్సైతో తీవ్రవాగ్వాదం.. మాజీ ఎమ్మెల్యేతో పాటు 10 మందిపై కేసు

by Vemula.Srinu Prasad |   (  Updated:2025-10-22 08:24:11  IST  )

చిత్తూరు జిల్లా పలమనేరు మాజీ ఎమ్మెల్యే వెంకట‌గౌడతో పాటు పది మందిపై కేసు నమోదు అయింది...

ఎస్సైతో తీవ్రవాగ్వాదం.. మాజీ ఎమ్మెల్యేతో పాటు 10 మందిపై కేసు
X

దిశ, వెబ్ డెస్క్: చిత్తూరు జిల్లా పలమనేరు మాజీ ఎమ్మెల్యే వెంకట‌గౌడ(Palamaneru Former MLA Venkata Gowda)తో పాటు పది మందిపై కేసు నమోదు అయింది. పలమనేరు మున్సిపల్ స్థలాన్ని ఓ వర్గంవాళ్లు కబ్జా చేశారంటూ వెంకడగౌడ తన అనుచరులతో కలిసి అడ్డుకున్నారు. ఆ నిర్మాణాలను జేసీబీలతో కూల్చేందుకు ప్రయత్నం చేశారు. అయితే ఆ సమయంలో స్థానిక ఎస్సై అక్కడకు వెళ్లారు. సర్ది చేప్పే ప్రయత్నం చేశారు. దీంతో వెంకటగౌడ ఆగ్రహం వ్యక్తం చేశారు. తమర్ని ఎవరు, ఎందుకు వచ్చారంటూ ఎస్సైతో వెంకటగౌడ, ఆయన అనుచరులు తీవ్ర వాగ్వాదానికి దిగారు. విధి నిర్వహణలో ఉన్న ఎస్సైతో దురుసుగా ప్రవర్తించారు. ఒక్కసారిగా ఎస్సై వైపు దూసుకెళ్లారు. అయితే ఇందుకు దీటుగా సమాధానం చెప్పారు. శాంతి భద్రతలు సమస్యలు సృష్టించొద్దని ఎస్సై హెచ్చరించారు. ఈ ఘటనపై ఈ రోజు పోలీసులు కేసు నమోదు చేశారు. తదుపరి చర్యలు చేపట్టేందుకు సిద్ధమయ్యారు.

Next Story