- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Breaking: ఇద్దరు విద్యార్థుల కిడ్నాప్.. నటుడు మోహన్ బాబుపై కేసు నమోదు
నటుడు మోహన్ బాబుపై చిత్తూరు జిల్లాలో పోలీసు కేసు నమోదు అయింది...

దిశ, వెబ్ డెస్క్: సినీ నటుడు మోహన్ బాబు(Film actor Mohan Babu) మరో వివాదంలో చిక్కుకున్నారు. విద్యార్థుల కిడ్నాప్ ఘటనకు సంబంధించి ఆయనపై తిరుచానూరు పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు అయింది. చిత్తూరు జిల్లాలోని మోహన్ బాబు యూనివర్సిటీలో అధికంగా ఫీజులు వసూలు చేస్తున్నారంటూ ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యార్థులు ధర్నాకు పిలుపునిచ్చారు. ఈ క్రమంలో తిరుపతి కలెక్టరేట్‌కు వెళ్లేందుకు విద్యార్థి నేతలు అక్బర్, వినోద్ ప్రయత్నం చేశారు. అయితే మార్గంమధ్యలో ఇద్దరూ కూడా కిడ్నాప్‌నకు గురయ్యారు. దీంతో మోహన్ బాబు, విష్ణు పీఆర్వో సతీశ్‌పై విద్యార్థులు అనుమానం వ్యక్తం చేశారు. పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
మోహన్ బాబు యూనివర్సిటీని బ్లాక్ లిస్టులో పెట్టాలని డిమాండ్
అయితే విద్యార్థులను కిడ్నాప్ చేసిన మోహన్ బాబు యూనివర్సిటీని బ్లాక్ లిస్టులో పెట్టాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. అంతేకాదు నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. విద్యార్థులకు యూనివర్సిటీ చెల్లించాల్సిన కోట్లాది రూపాయాలను వెంటనే చెల్లించాలని, గతంలో హయ్యర్ ఎడ్యుకేషన్ శాఖ నోటీసులు ఇచ్చి జరిమానా విధించినప్పటికీ మోహన్ బాబులో ఎలాంటి మార్పురాలేదని విద్యార్థి సంఘాలు మండిపడ్డాయి.






