- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
CM Chandrababu:‘రేపు స్వాతంత్య్ర దినోత్సవం’..ప్రతి ఇంటి పై జాతీయ జెండా రెపరెపలాడాలని పిలుపు
దేశంలో రేపు (ఆగస్టు 15) 78వ స్వాతంత్య్ర దినోత్సవం ఘనంగా జరుపుకుంటారు. మువ్వన్నెల జెండాను ఎగురవేసి జాతీయ గీతం ఆలకించుతారు.

దిశ,వెబ్‌డెస్క్:దేశంలో రేపు (ఆగస్టు 15) 78వ స్వాతంత్య్ర దినోత్సవం ఘనంగా జరుపుకుంటారు. మువ్వన్నెల జెండాను ఎగురవేసి జాతీయ గీతం ఆలకించుతారు. ఈ క్రమంలో ఏపీ సీఎం చంద్రబాబు ప్రజలకు ముందుస్తు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన సోషల్ మీడియాలో 'హర్ ఘర్ తిరంగా' కార్యక్రమాన్ని ప్రస్తావించారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ..ప్రధాని నరేంద్ర మోడీ ‘హర్ గర్ తిరంగా’ కార్యక్రమం ద్వారా ప్రతి ఇంటి పై జాతీయ జెండాను ఎగుర వేయడం గర్వకారణమన్నారు.
ఇది దేశ సమగ్రతకు కాపాడుతుంది. ఈ కార్యక్రమం వరుసగా మూడు సంవత్సారులు అవుతుందన్నారు. 'ఇంటింటా జాతీయ జెండా' అనే ఈ కార్యక్రమం మరింత విస్తరించడం ఆనందకర విషయామని తెలిపారు. మన తెలుగువాడైన పింగళి వెంకయ్య రూపొందించిన త్రివర్ణపతాకం జాతీయ జెండా రూపంలో ప్రతి ఇంటిపై ఎగరడం మనకు గర్వకారణం. ఈ నేపథ్యంలో రేపు ప్రతి ఇంటిపై, ప్రతి కార్యాలయంపై మన మువ్వన్నెల జాతీయ జెండాను రెపరెపలాడించండి అని సీఎం చంద్రబాబు పిలుపునిచ్చారు.






