28న కేబినెట్ భేటీ.. పలు అంశాలకు గ్రీన్ సిగ్నల్

by Vemula.Srinu Prasad |

సీఎం చంద్రబాబు అధ్యక్షతన బుధవారం కేబినెట్ భేటీ జరగనుంది.....

28న కేబినెట్ భేటీ.. పలు అంశాలకు గ్రీన్ సిగ్నల్
X

దిశ, వెబ్ డెస్క్: రాష్ట్రాన్ని అభివృద్ధిపథంలో నడిపేందుకు కూటమి ప్రభుత్వం కృషి చేస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా ఎప్పటికప్పుడు సమర్థమైన పాలన అందిస్తోంది. ప్రభుత్వ పని తీరు, చేయాల్సిన పనులు, కొత్త పథకాల అమలుపై ఎప్పటికప్పుడు పరిశీలన చేస్తోంది. ఇందులో భాగంగా ఎంపీలు, పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులతో వరుస భేటీలు నిర్వహిస్తోంది. ప్రభుత్వ పథకాలు, పని తీరుపై సమీక్షిస్తోంది. ఇప్పటికే పలుమార్లు ఏపీ కేబినెట్ భేటీ అయింది. పలు అంశాలకు ఆమోదం తెలిపారు. తాజాగా మరోసారి కేబినెట్ భేటీ నిర్వహించాలని నిర్ణయించారు. ఇప్పటికే తేదీని ఖరారు చేశారు. సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఈ నెల 28న కేబినెట్ భేటీ కావాలని నిర్ణయించారు. ఈ భేటీలో పలు అంశాలపై చర్చించనున్నారు. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలపైనా చర్చించనున్నారు. రాష్ట్రాల ఎంపీలకు చేయాల్సిన సూచనలపైనా చర్చించనున్నారు.

ఈ భేటీ అనంతరం సీఎం చంద్రబాబు వరుస పర్యటనలు చేయనున్నారు. 29న అరకు, 30,31న కుప్పంలో ఆయన పర్యటించనున్నారు. పలు అభివృద్ధి కార్యక్రమాలను చంద్రబాబు ప్రారంభించనున్నారు.

Next Story