- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తునిలో దారుణం.. కాలుకు ఆపరేషన్ చేసి బ్లేడ్ మర్చిపోయిన డాక్టర్లు
తూర్పుగోదావరి జిల్లా తుని ప్రభుత్వ ఆస్పత్రిలో దారుణం జరిగింది...

దిశ, వెబ్ డెస్క్: తూర్పుగోదావరి జిల్లా(East Godavari District) తుని ప్రభుత్వ ఆస్పత్రి(Tuni Government Hospital)లో దారుణం జరిగింది. కాలుకు శస్త్ర చికిత్స చేసి బ్లేడ్ మర్చిపోయారు. ఎస్. అన్నవరం పంచాయతీ రామకృష్ణానగర్‌కు చెందిన యువకుడు చిన్నా కాలుకు గాయమయింది. దీంతో విశాఖ ప్రభుత్వ ఆస్పత్రిలో శస్త్ర చికిత్స చేయించుకున్నారు. కాలులో స్టీల్ రాడ్డు వేసి స్క్రూ అమర్చారు. అయితే కాలుకు ఇబ్బంది కలగడంతో చిన్నా ఆస్పత్రికి వెళ్లారు. చికిత్స చేసి స్క్రూను తొలగించిన వైద్యులు.. కాలులోనే బ్లేడును ఉంచి కుట్లు వేశారు. కాలు మరింత నొప్పిగా ఉండటంతో ఎక్స్ రే చేయించారు. దీంతో కాలులో బ్లేడ్ ఉన్నట్లు రిపోర్టు వచ్చింది. తీవ్ర ఆందోళనకు గురైన బాధితుడు ఆస్పత్రి వైద్యులను సంప్రదించారు. ఈ మేరకు కాలుకు చికిత్స చేసి బ్లేడును తొలగించారు. అయితే ఈ విషయం బయటకు పొక్కడంతో ఆస్పత్రి సిబ్బందిపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఇలాంటివి మామూలేనని సోషల్ మీడియాలో నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు.






