- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ప్రార్థనా సమావేశానికి ఆలస్యం.. విద్యార్థులపై దాడి చేసిన ప్రిన్సిపల్
కడప జిల్లా పెండ్లిమర్రి జూనియర్ కాలేజీలో దారుణం జరిగింది....

X
దిశ, వెబ్ డెస్క్: కడప జిల్లా(Kadapa) పెండ్లిమర్రి జూనియర్ కాలేజీ(Pendlimari Junior College)లో దారుణం జరిగింది. కాలేజీలో జరిగిన ప్రార్థనా సమావేశానికి కొందరు విద్యార్థులు(Students) రెండు నిమిషాలు ఆలస్యమయ్యారు. దీంతో ప్రిన్సిపల్(Principal) ఆగ్రహం వ్యక్తం చేశారు. కాలేజీ బయట ఉన్న విద్యార్థులను తన ఛాంబర్‌లోకి పిలిచి సీరియస్ అయ్యారు. బూతులు తిడుతూ విద్యార్థులపై దాడి చేశారు. విచక్షణా రహితంగా కొట్టడంతో విద్యార్థులకు గాయాలయ్యాయి. అయితే ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి రావడంతో ప్రిన్సిపల్ వ్యవహారం జిల్లాలో చర్చగా మారింది. ప్రిన్సిపల్‌పై వెంటనే చర్యలు తీసుకోవాలని విద్యార్థి సంఘాల నుంచి డిమాండ్లు వినిపిస్తున్నాయి. ప్రిన్సిపల్ తన తీరును మార్చుకోవాలని పలువురు లెక్చరర్లు సైతం అంటున్నారు. విద్యార్థులపై దాడి చేసిన ప్రిన్సిపల్ స్పందన ఎలా ఉంటుందో చూడాలి మరి.
Next Story






