- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఇటుక బట్టిలో పిల్లలతో వెట్టి చాకిరి!
పాఠశాలలకు వెళ్లాల్సిన పిల్లలు.. పనికి పోతున్నారు. పుస్తకాల సంచులు మోయాల్సిన వారి భుజాలు కుటుంబ బాధ్యతలను మోస్తున్నాయి.

దిశ, వెబ్ డెస్క్ : పాఠశాలలకు వెళ్లాల్సిన పిల్లలు.. పనికి పోతున్నారు. పుస్తకాల సంచులు మోయాల్సిన వారి భుజాలు కుటుంబ బాధ్యతలను మోస్తున్నాయి. పేదరికం శాపమైందో.. లేక ఆర్థిక స్థితి గతులే బాగాలేవో తెలియదు కానీ ముగ్గురు బాలురు ఇటుక బట్టిలో (Bricks Kiln) పని చేస్తున్న ఓ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. పుస్తకాలు మోయాల్సిన వయసులో పిల్లలు ఇటుక బట్టిలో పని చేస్తూ (Child Workers) కనిపిస్తున్న దృశ్యం మనసున్న ప్రతిఒక్కరినీ కదిలిస్తోంది.
కాకినాడ జిల్లాలోని కిర్లంపూడి మండలంలో ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. రాజమండ్రికి సమీపంలో జరిగినట్లుగా పేర్కొంటున్న ఈ వీడియోలో ఓ ఇటుక బట్టి కనిపిస్తోంది. అందులో ఓ మహిళతో పాటు ముగ్గురు బాలురు కనిపిస్తున్నారు. వారు మహిళా కూలీకి సహాయంగా ఇటుకలను మోస్తున్నారు. తమ చిట్టి చేతులతో పుస్తకాలు, పెన్నులు, పెన్సిల్లు పట్టుకోవాల్సిన వయసులో బరువైన ఇటుకలను మోస్తూ కష్టపడుతున్నారు. ఆ కష్టానికి వారి చేతులు కాయలు కాస్తున్నాయో లేక నొప్పులే పెడుతున్నాయో అని వీడియో చూసినవారు అనుకుంటున్నారు. బాలలను పనిలో పెట్టుకోవద్దని చట్టాలు ఉన్నప్పటికీ.. ఇటుక బట్టీల నిర్వాహకులు వారిని ఎలా పని పెట్టుకుంటారని పలువురు ప్రశ్నిస్తున్నారు.
ఈ వీడియోకు సంబంధించిన వాస్తవాలను పరిశీలించి తగిన చర్యలు చేపట్టాలని అధికారులను డిమాండ్ చేస్తున్నారు. ఒకవేళ నిజంగానే బట్టీలలో చిన్నారులు పని చేస్తున్నట్లైతే తగిన కార్యాచరణతో బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు మరింత కృషి చేయాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడుతున్నారు. ఇందుకు పౌర సమాజం ప్రభుత్వం మద్ధతుగా ఉంటుందని పేర్కొంటున్నారు.






