- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మాచర్లలో వైసీపీకి బిగ్ షాక్.. టీడీపీలో చేరిన 17 మంది కౌన్సిలర్లు
మాచర్లలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి బిగ్ షాక్ తగిలింది..

దిశ, వెబ్ డెస్క్: మాచర్ల(Macharla)లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ(Ysr Congress Party)కి బిగ్ షాక్ తగిలింది. 17 మంది కౌన్సిలర్లు తెలుగుదేశం పార్టీ(Telugu Desam Party)లో చేరారు. మంత్రి గొట్టిపాటి రవికుమార్(Minister Gottipati Ravikumar), ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందారెడ్డి(MLA Julakanti Brahmananda Reddy) సమక్షంలో వారంతా పసుపు జెండా కప్పుకున్నారు. కాగా గత ప్రభుత్వ హయాంలో ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అధిపత్యం కొనసాగించింది. అప్పట్లో మాచర్ల మున్సిపాలిటీని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది.
అయితే రాష్ట్రంలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ ఘోరంగా ఓడిపోవడం, పిన్నెల్లిపై టీడీపీ అభ్యర్థి జూలకంటి బ్రహ్మానందారెడ్డి గెలవడంతో పరిస్థితులు తారుమారయ్యారు. ఎన్నికల పోలింగ్ బూత్‌లో దౌర్జాన్యానికి పాల్పడిన కేసులో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి జైలు పాలయ్యారు. దీంతో మాచర్లలో వైసీపీని నడిపే నాయకుడు కరువు అయ్యారు. ఈ మేరకు ఆ పార్టీకి చెందిన నేతలు, కార్యకర్తలు, కౌన్సిలర్లు కూటమి వైపు చూస్తున్నారు. మాచర్ల మున్సిపాలిటీలో మొత్తం 31వార్డులుండగా తాజాగా 17 మంది కౌన్సిలర్లు తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. దీంతో మాచర్ల మున్సిపాలిటీపై ఫోకస్ పెట్టారు. ఛైర్ పర్సన్‌పై అవిశ్వాసం పెట్టే యోచనలో ఉన్నారు. త్వరలో నోటీసులు ఇచ్చే అవకాశం ఉంది.






