విశాఖ శారదా పీఠానికి బిగ్ షాక్.. తిరుమల నిర్మాణాలపై హైకోర్టు సీరియస్ వార్నింగ్

by Vemula.Srinu Prasad |   (  Updated:2025-01-22 13:55:44  IST  )

విశాఖ శారదా పీఠానికి బిగ్ షాక్ తగిలింది...

విశాఖ శారదా పీఠానికి బిగ్ షాక్.. తిరుమల నిర్మాణాలపై హైకోర్టు సీరియస్ వార్నింగ్
X

దిశ, వెబ్ డెస్క్: విశాఖ శారదా పీఠానికి(Visakha Sarada Peetham) బిగ్ షాక్ తగిలింది. తిరుమల(Tirumla)లో నిర్మాణాలను తక్షణమే నిలిపివేయాలని, లేనిపక్షంలో కూల్చివేతకు ఆదేశాలు జారీ చేస్తామని హైకోర్టు(High Court) వ్యాఖ్యానించింది. అనుమతిలేకుండా నిర్మిస్తే ఉపేక్షించేలేదని తేల్చి చెప్పింది. ప్లాన్‌కు విరుద్ధంగా ఎందుకు నిర్మాణాలు చేపడుతున్నారని మండిపడింది. అనుమతి లేకుండా నిర్మాణాలు చేపడితే ఈ కేసు ఓ ఉదాహరణ అవుతుందని హెచ్చరించింది.

శారదా పీఠం అక్రమంగా తిరుమలలో నిర్మాణాలు చేపడుతున్నా టీటీడీ ఎలాంటి చర్యలు తీసుకోవడంలేదని తిరుమల క్షేత్రాల రక్షణ సమితి అధ్యక్షుడు ఓంకార్(Tirumala Kshetrala Rakshana Samithi President Omkar) హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. శారదా పీఠం భవనాన్ని సీజ్ చేయాలని టీటీడీ బోర్డు తీర్మానం చేసిందని పిల్‌లో పిటిషనర్ వివరించారు. ఈ పిల్‌పై విచారణ చేపట్టిన ధర్మాసనం.. శారదా పీఠం నిర్మాణాలపై సీరియస్ అయింది. గత ఆదేశాల ఉల్లంఘనలపై ఆగ్రహం వ్యక్తం చేసింది. కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది. అయితే

Next Story