- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రాజమండ్రి టీడీపీలో పెను సంచలనం.. ఒక్కసారిగా బద్దలైన అంతర్యుద్ధం
తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి టీడీపీలో పెను సంచలనం చోటు చేసుకుంది..

దిశ, వెబ్ డెస్క్: తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి టీడీపీ(Rajahmundry)లో ఓ సంచలన ఘటన జరిగింది. చాలా రోజులుగా జరుగుతున్న అంతర్యుద్ధం ఈరోజు బహిరంగంగా బయటపడింది. ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు(MLA Adireddy Vasu)పై సీనియర్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి(Gorantla Butchaiah Chowdhury) మధ్య ఉన్న విభేదాలు బహిర్గతం అయ్యాయి. ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు చేసిన వ్యాఖ్యలతో బుచ్చయ్య చౌదరి ఫైర్ అయ్యారు.. తెలుగు విశ్వవిద్యాలయం(Telugu University) ఏర్పాటు తన ఘనతేనని ఆదిరెడ్డి చెప్పుకోవడంతో ఆయన మండిపడ్డారు. తెలుగు విశ్వవిద్యాలయంకు భూముల కేటాయింపులో తాను కూడా భాగస్వామిని అని గుర్తు చేశారు. 1985లోనే నందమూరి తారక రామారావు(Nandamuri Taraka Rama Rao) స్వయంగా ఆ విశ్వవిద్యాలయాన్ని స్థాపించారని చెప్పారు.
అయితే యూనివర్సిటీ ఏర్పాటుకు కావాల్సిన ప్రణాళికలు సైతం ఎన్టీఆరే రచించారని, కానీ భూముల కేటాయింపులో తానూ కీలక పాత్ర పోషించానని చెప్పారు. అంతేకాదు రాష్ట్ర విభజన తర్వాత 2014-2019 మధ్య కాలంలో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు(Chief Minister Chandrababu)తో చాలా సార్లు చర్చించి తెలుగు విశ్వవిద్యాలయం రాష్ట్రానికి రావడానికి తాను చాలా కృషి చేశానని చెప్పారు. తన చరిత్ర తెలియకుండానే కొందరు మాట్లాడుతున్న తీరు చూస్తుంటే.. ఎవరో కన్న బిడ్డకు తండ్రిని తానే చెప్పుకున్న సామెత గుర్తొస్తోందని విమర్శించారు. రాజమండ్రి అభివృద్ధిలోనూ తన పాత్ర చాలా ఎక్కువగా ఉందని, ఎవరూ ఖండించలేరన్నారు. గత ఏడాది కాలంలో రాజమండ్రిలో ఏం అభివృద్ధి జరిగిందని, ఫ్లెక్సీలు కట్టుకుని, డబ్బాలు కొట్టుకుంటున్నారని బుచ్చయ్య చౌదరి ఎద్దేవా చేశారు.






