Liquor Case: తెరపైకి మరో కీలక నేత పేరు..?

by Vemula.Srinu Prasad |

నకిలీ మద్యం కేసులో పెను సంచలనం నమోదు చేసుకుంది..

Liquor Case: తెరపైకి మరో కీలక నేత పేరు..?
X

దిశ, వెబ్ డెస్క్: నకిలీ మద్యం కేసు(Fake Liquor Case)లో పెను సంచలన నమోదు చేసుకుంది. ఈ రోజు మాజీ మంత్రి జోగి రమేశ్(Former Minister Jogi Ramesh)ను పోలీసులు అరెస్ట్ చేశారు. అంతేకాదు ఆయనకు అనుచరులను కూడా అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

అయితే ఈ కేసులో మరో కీలక నేత ఉన్నారని టీడీపీ నేత బుద్దా వెంకన్న అంటున్నారు. విచారణలో ఆయన ఎవరనేది జోగి రమేశ్ చెబుతారని మాజీ సీఎం జగన్‌ను ఉద్దేశించి జోస్యం చెప్పారు. అంతేకాదు సూత్రధారులు, పాత్రధారులంతా జైలుకు వెళ్లడం ఖాయమన్నారు. నకిలీ మద్యం బాధితులతో తాడేపల్లిలో ధర్నా చేస్తానని బుద్దా వెంకన్న హెచ్చరించారు.

మరోవైపు జోగి రమేశ్ అరెస్ట్‌తో వైసీపీలో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆ పార్టీ నేతలు విమర్శలు చేస్తున్నారు. జోగి రమేశ్‌ను అక్రమంగా కేసులో ఇరికించారని, ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నందుకు ఇలా చేయిస్తున్నారని టీడీపీ నేతలపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీంతో రాష్ట్రంలో రాజకీయం ప్రస్తుతం మరింత వేడెక్కింది.

Next Story