పక్కకు ఒరిగిన 5 అంతస్థుల భవనం.. భయంతో బిక్క చచ్చిపోయిన నివాసితులు

by Muthe.Rajitha |

ఓ ఐదు అంతస్థుల భవనం పక్కకు ఒరిగిన ఘటన విశాఖలో కలకలం రేపింది.

పక్కకు ఒరిగిన 5 అంతస్థుల భవనం.. భయంతో బిక్క చచ్చిపోయిన నివాసితులు
X

దిశ, వెబ్ డెస్క్ : ఓ ఐదు అంతస్థుల భవనం పక్కకు ఒరిగిన ఘటన విశాఖలో కలకలం రేపింది. విశాఖపట్నం జిల్లాలోని వెలంపేట ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఐదు అంతస్థులు గల కసిరెడ్డి ప్లాజా ఒక్కసారిగా పక్కన ఉన్న మరో భవనంపై ఒరిగిపోయింది. దీంతో అందులో నివసిస్తున్న వారు ప్రాణభయంతో బయటికి తీశారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, అధికారులు ఆ రెండు భవనాల్లో ఉన్నవారిని ఖాళీ చేయించారు. స్థానిక ఎమ్మెల్యే వంశీకృష్ణ యాదవ్ ఘటనా స్థలానికి చేరుకొని పరిస్థితిని సమీక్షించారు.

ఆ భవనం నివాస యోగ్యం కాదని, వెంటనే దానిని కూల్చివేయాలని సూచించారు. అయితే వెలంపేట ప్రాంతంలో భూమి లూజ్ సాయిల్ రకానికి చెందిందని, బలమైన పునాదులు లేని భారీ భవనాలు నిలవలేవని ఇంజనీర్లు పేర్కొన్నారు.

Next Story