- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Penukonda: కుక్క పిల్లల విషయంలో ఘర్షణ.. 9 మందికి గాయాలు
కుక్కల పిల్లల విషయంలో జరిగిన ఘర్షణలో 9 మందికి గాయాలయ్యాయి...

X
దిశ, వెబ్ డెస్క్: కుక్క పిల్లల(Puppies) విషయంలో జరిగిన ఘర్షణలో 9 మందికి గాయాలయ్యాయి. ఈ ఘటన శ్రీసత్యసాయి జిల్లా పెనుకొండ మండలం సోమందేపల్లి మారుతీనగర్(Somandepalli Marutinagar)లో జరిగింది. కుక్క పిల్లలు తమ ఇళ్ల వద్దకు వచ్చి ఇబ్బందులకు గురి చేస్తున్నాయంటూ మరో కుటుంబానికి చెప్పారు. అయితే తమ పావురాళ్ల గుడ్ల దొంగతనం కోసం వచ్చారంటూ సదరు కుటుంబం ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో రెండు కుటుంబాల మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో పరస్పరం దాడులు చేసుకున్నారు. ఈ దాడుల్లో రెండు వర్గాలకు చెందిన 9 మందికి గాయాలయ్యాయి. ఈ మేరకు ఆస్పత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న పోలీసులు.. గాయపడిన వారి నుంచి ఫిర్యాదులు తీసుకున్నారు. కుక్కల పిల్లల విషయంలోనే ఘర్షణ చెలరేగినట్లు తెలిపారు. గ్రామంలో మరోసారి ఘర్షణ తలెత్తకుండా ఏర్పాట్లు చేసినట్లు పేర్కొన్నారు.
Next Story






