- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పండుగ వేళ విషాదం.. పుణ్యస్నానాలకు వెళ్లి ఐదుగురు గల్లంతు
పండుగ వేళ విషాదం చోటు చేసుకుంది. తూర్పుగోదావరి జిల్లా తాళ్లపూడి మండలం తాడిపూడిలో మహాశివరాత్రి వేడుకల్లో అపశృతి చోటు చేసుకుంది.

X
దిశ, డైనమిక్ బ్యూరో: శివరాత్రి పండుగ వేళ విషాదం చోటు చేసుకుంది. తూర్పుగోదావరి జిల్లా తాళ్లపూడి మండలం తాడిపూడిలో(tadipudi) మహాశివరాత్రి వేడుకల్లో అపశృతి చోటు చేసుకుంది. గోదావరిలో (godavari) పుణ్యస్నానానికి దిగిన ఐదుగురు యువకులు గల్లంతయ్యారు. గల్లంతైన యువకులు కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఇసుక ర్యాంపులో స్నానానికి మొత్తం 12 మంది యువకులు దిగారు. వీరిలో ఐదుగురు గల్లంతయ్యారు. మిగతా ఏడుగురు సురక్షితంగా బయటపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు, స్థానికులు నీటిలో మిస్సింగ్ అయిన యువకుల కోసం గజ ఈతగాళ్ల సాయంతో సెర్చింగ్ చేస్తున్నారు. గల్లంతైన వారిలో తిరుమలశెట్టి పవన్(19), పడాల దుర్గాప్రసాద్(17), అనిశెట్టి పవన్(19), గర్రె ఆకాష్(17), పడాల సాయి(19) ఉన్నారు. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
Next Story






