- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రాష్ట్రానికి కొత్తగా 784 మంది పీజీ వైద్యులు : మంత్రి సత్యకుమార్
by Naga Rani Yarlagadda |
రాష్ట్రానికి కొత్తగా 784 మంది పీజీ వైద్యులు రానున్నట్లు మంత్రి సత్యకుమార్ వెల్లడించారు.

X
దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రానికి కొత్తగా 784 మంది పీజీ వైద్యులు రానున్నట్లు మంత్రి సత్యకుమార్ వెల్లడించారు. జనవరి 5లోగా విధుల్లో చేరేలా డాక్టర్లకు పోస్టింగ్స్ ఇస్తామని చెప్పారు. కన్వీనర్ కోటాలో చదివినవారు ఏడాదిపాటు ప్రభుత్వ సర్వీసులో పనిచేసే విధానం ఉన్నట్లు తెలిపారు. నోటిఫికేషన్ జారీ, ఆప్షన్ల నమోదు ప్రక్రియను ప్రారంభిస్తామని పేర్కొన్నారు. ప్రతీ ఏటా సీనియర్ రెసిడెంట్స్ విధానాన్ని కొనసాగిస్తామన్నారు. పీజీ డాక్టర్ల నియామకంతో రాష్ట్రంలో పేషంట్లకు వైద్యసేవలు మరింత మెరుగవుతాయని, పీజీ వైద్యుల రాకతో సిబ్బంది కొరత కూడా తీరుతుందని వెల్లడించారు.
Next Story






