మొంథా తుఫాను ఎఫెక్ట్.. పునరావాస కేంద్రాలకు 75 వేల మంది

by Muthe.Rajitha |

కోస్తాంధ్ర తీరాన్ని మొంథా తుపాను సమీపిస్తుండటంతో ప్రభుత్వం మరింత అప్రమత్తమైంది.

మొంథా తుఫాను ఎఫెక్ట్.. పునరావాస కేంద్రాలకు 75 వేల మంది
X

దిశ, వెబ్ డెస్క్ : కోస్తాంధ్ర తీరాన్ని మొంథా తుపాను సమీపిస్తుండటంతో ప్రభుత్వం మరింత అప్రమత్తమైంది. భీకరంగా దూసుకువస్తున్న తుపాను విశాఖ, ఉమ్మడి ఉభయగోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో భారీగా ప్రభావం చూపనున్నట్లు వాతావరణ శాఖ స్పష్టం చేసింది. రాష్ట్రవ్యాప్తంగా 403 మండలాలపై తుపాను ప్రభావం ఉండనుందని, అత్యవసర పరిస్థితి ఎదుర్కోనేలా మండలాల వారీగా 488 కంట్రోల్ రూమ్‌లను ఏర్పాటు చేసారు. మొత్తం 1204 పునరావాస కేంద్రాలను సిద్ధం చేసి 75,802 మందిని అక్కడికి తరలించింది.

219కి పైగా మెడికల్ క్యాంపులను వివిధ ప్రాంతాల్లో ఏర్పాటు చేసింది. అత్యవసర సమాచార వ్యవస్థ కోసం 81 వైర్‌లెస్ టవర్లు, 21కి పైగా భారీ సైజు ఆస్కా ల్యాంపులను సిద్ధం చేసింది. 1147 జేసీబీలు, ప్రోక్లెయిన్లు, క్రేన్లుతోపాటు 321 డ్రోన్లను సర్కారు అందుబాటులో ఉంచింది. కూలిన చెట్లు తొలగించేందుకు 1040 భారీ వుడ్ కట్టింగ్ మెషీన్స్ సిద్ధం చేసింది. తుపాను ప్రభావంపై ఇప్పటి వరకు 3.6 కోట్ల మందికి మొబైల్ ఫోన్ల ద్వారా హెచ్చరికలు జారీ చేసారు.

Next Story