ఆ స్కూళ్లలో 67% సీట్లు ఏపీ విద్యార్థులకే.. తెలంగాణకు ఎంత శాతమంటే?

by Jakkula.Mamatha |   (  Updated:2025-05-03 09:40:54  IST  )

రాష్ట్రంలోని విద్యార్థులు ఆ స్కూళ్లలో చదువుకోవాలనే వారికి సైనిక్ పాఠశాల శుభవార్త చెప్పింది.

ఆ స్కూళ్లలో 67% సీట్లు ఏపీ విద్యార్థులకే.. తెలంగాణకు ఎంత శాతమంటే?
X

దిశ,వెబ్‌డెస్క్: రాష్ట్రంలోని విద్యార్థులు ఆ స్కూళ్లలో చదువుకోవాలనే వారికి సైనిక్ పాఠశాల శుభవార్త చెప్పింది. ఈ క్రమంలో కోరుకొండ, కలికిరి సైనిక్ స్కూళ్లలో చదువుకోవాలనుకునే రాష్ట్ర విద్యార్థులకు 2025-26 విద్యా సంవత్సరం నుంచి నూతన విధానం అమల్లోకి రానుంది. ఆ పాఠశాలల్లో 67 శాతం సీట్లు ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh)వారికే అందుబాటులో ఉంటాయని తాజాగా సైనిక్ పాఠశాల అధికారులు ప్రకటించారు. తెలంగాణ(Telangana) విద్యార్థులు ఇకపై ఇతర రాష్ట్రాల కోటా 33 శాతంలోనే పోటీ పడాల్సి ఉంటుందని తెలిపారు. కాగా రాష్ట్ర విభజన తర్వాత నుంచి తెలంగాణ విద్యార్థులకు కూడా 67 శాతం వాటా కొనసాగుతూ వచ్చింది. కానీ ప్రస్తుతం అడ్మిషన్ల నిబంధనలు మారాయని ఇక పై తెలంగాణకు 67 శాతం సీట్ల రిజర్వేషన్‌ ఉండబోదని అధికారులు స్పష్టం చేశారు.

Next Story