సీఎం చంద్రబాబు అధ్యక్షతన సీఆర్డీఏ అథారిటీ 59వ సమావేశం

by Naga Rani Yarlagadda |

సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన రాష్ట్ర సచివాలయంలో సీఆర్డీఏ అథారిటీ 59వ సమావేశం ప్రారంభమయింది.

సీఎం చంద్రబాబు అధ్యక్షతన సీఆర్డీఏ అథారిటీ 59వ సమావేశం
X

దిశ, వెబ్‌డెస్క్: సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన రాష్ట్ర సచివాలయంలో సీఆర్డీఏ అథారిటీ 59వ సమావేశం ప్రారంభమయింది. మంత్రులు నారాయణ, పయ్యావుల కేశవ్, సీఎస్ సాయిప్రసాద్, పట్టణ అభివృద్ధి, సీఆర్డీఏ, ఏడీసీఎల్ అధికారులు ఈ సమావేశానికి హ్జరయ్యారు. ప్రభుత్వంలో వివిధ సంస్థలకు భూ కేటాయింపులు, జీఓఎంల జారీ నిర్ణయాలపై చర్చిస్తున్నారు. అదేవిధంగా సచివాలయం, హెడ్ఆర్వోడీ భవనాల్లో మౌలిక సదుపాయాల కల్పనపై చర్చించనున్నారు. ఈపీపీ పద్ధతిలో తెలుగు కల్చరల్ సెంటర్ ఏర్పాటు చేసే విషయంపై సీఎం చంద్రబాబు సమీక్షించనున్నారు. రాజధాని పరిధిలో కన్వెన్షన్ సెంటర్ నిర్మాణంపై చర్చించనున్నారు. సమావేశాలు నిర్వహించుకునేలా కన్వెన్షన్ సెంటర్ ఏర్పాటు చేసుకోవాలని ప్రభుత్వం ఇప్పటికే ప్రతిపాదించింది. దీని అమలుపై అధికారులతో సీఎం సమీక్షలో చర్చించనున్నారు.

Next Story