Narendra modi: మోదీ సభకు 5 లక్షల మంది

by Thanuru Gopichand |   (  Updated:2025-04-23 06:26:09  IST  )

అమరావతి రాజధాని పునర్నిర్మాణ పనులను ప్రారంభించేందుకు వచ్చేనెల మొదటివారంలో ప్రధాని మోదీ రానున్న నేపథ్యంలో రాజధాని ప్రాంతంలో మంత్రి నారాయణ ఈ రోజు పర్యటించారు.

Narendra modi: మోదీ సభకు 5 లక్షల మంది
X

కిలోమీటరు మేర రోడ్ ​షో

రాజధాని ప్రాంతంలో మంత్రి నారాయణ పర్యటన

ఏర్పాట్లు చేస్తున్న అధికారులు

దిశ, డైనమిక్ ​బ్యూరో: అమరావతి రాజధాని (Amaravathi) పునర్నిర్మాణ పనులను ప్రారంభించేందుకు వచ్చేనెల మొదటివారంలో ప్రధాని మోదీ రానున్న నేపథ్యంలో రాజధాని ప్రాంతంలో మంత్రి నారాయణ (Minister narayana) ఈ రోజు పర్యటించారు. గుంటూరు రేంజ్ ఐజీ త్రిపాఠి తో కలిసి ప్రధాని సభకు వచ్చే రోడ్లు పరిశీలించారు. సభా వేదిక వద్దకు చేరుకునే రోడ్లు, పార్కింగ్ ప్రాంతాలు చూశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజధాని ప్రాంతంలో 64 వేల కోట్ల విలువైన టెండర్లు పిలిచాం అన్నారు. వచ్చే నెల 2 న రాజధాని పనులు ప్రధాని చేతుల మీదుగా రీ లాంచ్ జరుగుతుందన్నారు. వచ్చే నెల 2 న ప్రధాని సాయంత్రం 4 నుంచి 5 గంటలవరకు బహిరంగ సభలో పాల్గొంటారని తెలిపారు. 5 లక్షల మంది ప్రజలు బహిరంగ సభకు హాజరవుతారని అంచనా వేస్తున్నట్లు పేర్కొన్నారు. రాజధాని లో కొన్ని రోడ్ల నిర్మాణం ఇంకా పూర్తి కాలేదని తెలిపారు. పోలీసు శాఖ సమన్వయం తో సీఆర్డీఏ సిబ్బంది తో కలిసి రోడ్లను త్వరితగతిన పూర్తి చేస్తున్నామన్నారు. మొత్తం 11 పార్కింగ్ ప్రాంతాలు ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. మంగళగిరి, తాడికొండ, హరిశ్చంద్రపురం, ప్రకాశం బ్యారేజి, వెస్ట్ బైపాస్ మీదుగా సభకు చేరుకునే విధంగా ఏర్పాట్లు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రధాని హెలిప్యాడ్ (Helipad) నుంచి సెక్యూరిటి సూచనల ప్రకారం కిలోమీటర్ మేరరోడ్ షో (Road show) ఉంటుందన్నారు

Next Story