- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఏపీలో వారందరికీ రూ.5 లక్షలు... జస్ట్ ఇలా చేస్తే చాలు
తెలుగుదేశం పార్టీ ( TDP) పొలిట్ బ్యూరో కీలక నిర్ణయం తీసుకుంది. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు ( Telugu Desam Party worke

దిశ, వెబ్ డెస్క్: తెలుగుదేశం పార్టీ ( TDP) పొలిట్ బ్యూరో కీలక నిర్ణయం తీసుకుంది. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు ( Telugu Desam Party workers) ఊరట బీమా సౌకర్యాన్ని మరోసారి తీసుకువచ్చింది. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు ఐదు లక్షల బీమాను ( Insurance) అమలు చేయబోతున్నట్లు తాజాగా టీడీపీ పార్టీ ( TDP) కీలక నిర్ణయం తీసుకుంది. గతంలో టిడిపి కార్యకర్తలకు జీవిత బీమా ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పుడు కూడా అదే కార్యక్రమాన్ని కొనసాగించనున్నట్లు తెలిపారు ఏపీ మంత్రి అచ్చెన్నాయుడు ( Kinjarapu Atchannaidu).
టిడిపి కార్యకర్తలు చనిపోతే వీలైనంత త్వరగా బీమా అందేలా చర్యలు తీసుకోవాలని పొలిట్ బ్యూరోలో నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. అలాగే మహానాడుకు సంబంధించిన కీలక విషయాలను కూడా ఈ సందర్భంగా అచ్చెన్నాయుడు వెల్లడించారు. మహానాడు ( TDP Mahanadu) కార్యక్రమం లోపు పార్టీలో ఉన్న అన్ని విభాగాల కమిటీల భక్తి కూడా ఉంటుందని వివరించారు. ఇక ఈ మహానాడు సందర్భంగా బాలయ్యను ( Balayya) అభినందించబోతున్నట్లు ప్రకటించారు. ఇక దీపం పథకం నగదు చెల్లింపులు ముందుగానే జరుగుతాయని కూడా వివరించారు.






