Mauritius: వచ్చే ఏడాది మారిషస్‌లో 4వ ప్రపంచ తెలుగు మహాసభలు

by Ramesh Naini |   (  Updated:2026-01-04 17:01:58  IST  )

గుంటూరులో జరిగిన ప్రపంచ తెలుగు మహాసభల్లో మాతృభాష పరిరక్షణపై పలువురు ప్రముఖులు ఆవేదన వ్యక్తం చేశారు.

Mauritius: వచ్చే ఏడాది మారిషస్‌లో 4వ ప్రపంచ తెలుగు మహాసభలు
X

దిశ, డైనమిక్ బ్యూరో: గుంటూరులో జరిగిన ప్రపంచ తెలుగు మహాసభల్లో మాతృభాష పరిరక్షణపై పలువురు ప్రముఖులు ఆవేదన వ్యక్తం చేశారు. అవసరానికి ఇతర భాషలు నేర్చుకున్నా తెలుగు భాష, సంస్కృతి, సంప్రదాయాలను నిర్లక్ష్యం చేయొద్దని సూచించారు. తెలుగు పండుగలను ఘనంగా నిర్వహించడం ద్వారా సంస్కృతి గొప్పదనాన్ని ప్రపంచానికి చాటాలని కోరారు.

రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న చర్యలు సరిపోవని, భాషాభివృద్ధికి మరింత కృషి అవసరమని అభిప్రాయపడ్డారు. మారిషస్‌లో తెలుగు భాషా పరిరక్షణకు తీసుకుంటున్న చర్యలను ఆదర్శంగా తీసుకోవాలని ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ అన్నారు. 2027 జనవరి 8, 9, 10 తేదీల్లో మారిషస్‌లో 4వ ప్రపంచ తెలుగు మహాసభలు నిర్వహించాలని నిర్ణయించారు. ఈ మేరకు ఆంధ్ర సారస్వత పరిషత్‌, మారిషస్ తెలుగు మహాసభ సంఘాల మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది.

Next Story