- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
SC Railway : ప్రయాణికుల రద్దీ.. మరో 48 అదనపు రైళ్లు : దక్షిణ మధ్య రైల్వే
by Muthe.Rajitha |
ప్రయాణికుల రద్దీ దృష్టిలో ఉంచుకొని దక్షిణ మధ్య రైల్వే(South Central Railway) మరో కీలక నిర్ణయం తీసుకుంది.

X
దిశ, వెబ్ డెస్క్ : ప్రయాణికుల రద్దీ దృష్టిలో ఉంచుకొని దక్షిణ మధ్య రైల్వే(South Central Railway) మరో కీలక నిర్ణయం తీసుకుంది. రద్దీకి అనుగుణంగా మరో 48 రైళ్లను అదనంగా(Special Trains) నడపనున్నట్టు వెల్లడించింది. ఈనెల 9 నుంచి సెప్టెంబర్ 25 వరకు వివిధ రోజుల్లో ఈ ప్రత్యేక రైళ్లను నడపనున్నట్టు దక్షిణ మధ్య రైల్వే పేర్కొంది. నరసాపూర్-తిరువణ్ణలైకి బుధ, గురు వారాల్లో 16 రైళ్లు, కాచిగూడ-తిరుపతికి గురు, శుక్రవారాల్లో 8 రైళ్లు, తిరుపతి-హిసార్ మధ్య బుధ, ఆదివారాల్లో 12 ప్రత్యేక రైళ్లు అందుబాటులో ఉండనున్నాయి. కాగా ఈ రైళ్లల్లో ముందస్తు రిజర్వేషన్ సౌకర్యం కూడా ఉందని, మరిన్ని వివరాలు సౌత్ సెంట్రల్ రైల్వే అధికారిక వెబ్సైట్ లో పొందు పరిచామని రైల్వే అధికారులు తెలియజేశారు.
Next Story






