- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అంబటి రాంబాబుపై ఏపీ వ్యాప్తంగా 36 కేసులు
మాజీ మంత్రి అంబటి రాంబాబు పై రాష్ట్రవ్యాప్తంగా 36 కేసులు నమోదయ్యాయి. ఇటీవల అంబటి సీఎం చంద్రబాబును దూషించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఆయనపై టీడీపీ నాయకులు రాష్ట్రవ్యాప్తంగా ఫిర్యాదులు చేస్తున్నారు.

దిశ, వెబ్ డెస్క్: మాజీ మంత్రి అంబటి రాంబాబు పై రాష్ట్రవ్యాప్తంగా 36 కేసులు నమోదయ్యాయి. ఇటీవల అంబటి సీఎం చంద్రబాబును దూషించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఆయనపై టీడీపీ నాయకులు రాష్ట్రవ్యాప్తంగా ఫిర్యాదులు చేస్తున్నారు. ఈ కేసులో ఇప్పటికే ఆయనను అరెస్ట్ చేయగా రిమాండ్ లో ఉన్నారు. మరోవైపు ఇప్పటి వరకు 36 కేసులు నమోదవ్వగా మరిన్ని కేసులు నమోదు చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఇక అంబటి రాంబాబు అరెస్ట్‌ను వైసీపీ నేతలు, ఆయన కుటుంబ సభ్యులు ఖండిస్తున్నారు. కేంద్రమంత్రి పెమ్మసాని ఈ దాడికి సూత్రదారి అంటూ ఆరోపిస్తున్నారు. అంబటిని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నారు. మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి అంబటి ఇంటికి వెళ్లి ఆయన కుటుంబాన్ని పరామర్శించి వారికి ధైర్యం చెప్పారు. ఇప్పటికే అంబటి రాంబాబు కోర్టులో క్వాష్ పిటిషన్లు వేస్తుండగా వరుస కేసులు నమోదవ్వడంతో కార్యకర్తలకు ఆందోళన కలిగిస్తోంది.






