- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తిరుమలకు పోటెత్తిన భక్తులు.. కంపార్టుమెంట్లన్నీ ఫుల్ !
తిరుమలకు భక్తులు పోటెత్తారు. వారాంతం, వేసవి సెలవులు కావడంతో శ్రీవారిని దర్శించుకునేందుకు తరలి వస్తున్నారు.

దిశ, వెబ్‌డెస్క్: కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీ వేంకటేశ్వరస్వామివారిని దర్శించుకునేందుకు శుక్రవారం భక్తులు పోటెత్తారు. వారాంతం, వేసవి సెలవులు కావడంతో శ్రీవారిని దర్శించుకునేందుకు భక్తులు తిరుపతికి తరలి వెళ్తున్నారు. శుక్రవారం ఉదయం 8 గంటలకు 31 కంపార్టుమెంట్లు భక్తులతో నిండిపోయాయి. టోకెన్లు లేని భక్తులకు స్వామివారి సర్వదర్శనానికి 18 గంటల సమయం పడుతుందని టీటీడీ వెల్లడించింది. అలాగే సర్వదర్శనం, దివ్య దర్శనం టోకెన్లు ఉన్న భక్తులకు 4-6 గంటల సమయం, రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 3-4 గంటల సమయం పడుతుందని తెలిపింది. నిన్న (గురువారం) స్వామివారిని 63,454 మంది భక్తులు దర్శించుకోగా.. 24,882 మంది భక్తులు తలనీలాల మొక్కులు చెల్లించుకున్నారు. భక్తులు సమర్పించిన కానుకల ద్వారా హుండీ ఆదాయం రూ.4.12 కోట్లు సమకూరినట్లు టీటీడీ తెలిపింది. మరోవైపు వేసవి తాపాన్ని దృష్టిలో ఉంచుకుని కొండపై భక్తులకు అన్న, పానీయాలకు లోటు లేకుండా టీటీడీ చర్యలు తీసుకుంటోంది. క్యూలైన్లు, కంపార్టుమెంట్లలో ఉన్న భక్తులకు మజ్జిగ, పాలు అందిస్తోంది.






