టీడీపీలోకి 200 కుటుంబాల చేరిక

by Ramesh Naini |

టీడీపీలోకి 200 కుటుంబాల చేరిక
X

దిశ, డైనమిక్ బ్యూరో : విజయనగరం నగరపాలక సంస్థ 36వ డివిజన్‌కు చెందిన వైసీపీ మాజీ కార్పొరేటర్ బాలి పద్మావతి, ఇతర ముఖ్య నాయకులు సహా సుమారు 200 కుటుంబాలు ఆదివారం టీడీపీలో చేరాయి. ఎమ్మెల్యే పూసపాటి అదితి విజయలక్ష్మి గజపతిరాజు వీరికి పసుపు కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్‌ల అభివృద్ధి, సుపరిపాలనను చూసే వివిధ పార్టీల నుంచి ప్రజలు భారీగా టీడీపీ వైపు ఆకర్షితులవుతున్నారని ఎమ్మెల్యే అదితి గజపతిరాజు తెలిపారు. టీడీపీ ఎల్లప్పుడూ కార్యకర్తలకు, ప్రజా సంక్షేమానికి పెద్దపీట వేస్తుందని ఆమె స్పష్టం చేశారు.

Next Story