- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Chandrababu : ఐదేళ్లలో యువతకు 20లక్షల ఉద్యోగాలు : చంద్రబాబు
ఈ ఐదేళ్ళలో యువతకు 20 లక్షల ఉద్యోగా(20 Lakh Jobs)లు ఇచ్చేందుకు నిత్యం శ్రమిస్తున్నామని.. అలాగే ఇంటికో పారిశ్రామికవేత్తను తయారుచేసే లక్ష్యంతో కార్యక్రమాలు రూపొందిస్తున్నామని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు(AP CM Chandrababu Naidu)పేర్కొన్నారు.

దిశ, వెబ్ డెస్క్ : ఈ ఐదేళ్ళలో యువతకు 20 లక్షల ఉద్యోగా(20 Lakh Jobs)లు ఇచ్చేందుకు నిత్యం శ్రమిస్తున్నామని.. అలాగే ఇంటికో పారిశ్రామికవేత్తను తయారుచేసే లక్ష్యంతో కార్యక్రమాలు రూపొందిస్తున్నామని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు(AP CM Chandrababu Naidu)పేర్కొన్నారు. స్వామి వివేకానంద జయంతి(Swami Vivekananda Jayanti)..జాతీయ యువజన దినోత్సవం(National Youth Day)సందర్భంగా యువతీ యువకులకు చంద్రబాబు శుభాకాంక్షలు తెలిపారు.
"శ్రమ నీ ఆయుధం అయితే విజయం నీకు బానిస అవుతుంది" అంటూ అద్భుతమైన సందేశాన్ని వివేకానంద స్ఫూర్తితో రాష్ట్ర పునర్నిర్మాణంలో, పేదరిక నిర్మూలనలో, సమసమాజ స్థాపనలో యువశక్తి భాగస్వామి కావాలన్నారు. శక్తివంతమైన సోషల్ మీడియా, ఇంటర్ నెట్, ఏఐ వంటి సాంకేతిక పరిజ్ఞానాన్ని దుర్వినియోగం చేయకుండా మీ అభివృద్ధి కోసం ఉపయోగించుకోవాలన్నారు. ఈ ఐదేళ్ళలో యువతకు 20 లక్షల ఉద్యోగాలు ఇచ్చేందుకు నిత్యం శ్రమిస్తున్నామన్నారు.
అలాగే ఇంటికో పారిశ్రామికవేత్తను తయారుచేసే లక్ష్యంతో కార్యక్రమాలు రూపొందిస్తున్నామని తెలిపారు. దేశంలో మొదటిసారిగా స్కిల్ సెన్సెస్ చేపడుతున్నామని.. మీరు(యువత) లక్ష్యాలను నిర్దేశించుకోండి.. వాటిని చేరుకునేందుకు మీ ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.






