- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
విశాఖలో 189 టన్నుల అక్రమ గోమాంసం పట్టివేత
విశాఖ పోలీసులు భారీగా అక్రమ గోమాంసం స్వాధీనం చేసుకున్న కలకలం రేపింది.

దిశ, వెబ్ డెస్క్ : విశాఖ పోలీసులు భారీగా అక్రమ గోమాంసం స్వాధీనం చేసుకున్న కలకలం రేపింది. విశాఖపట్నం జిల్లా ఆనందపురం మండలం సొంట్యం గ్రామంలోని శ్రీ మిత్రా మెరైన్ ఏజెన్సీ కోల్డ్ స్టోరేజ్‌పై పోలీసులు, విజిలెన్స్, ఫుడ్ సేఫ్టీ, వెటర్నరీ శాఖలు సంయుక్తంగా దాడిచేసి 189 టన్నుల అక్రమంగా నిల్వ ఉంచినమాంసాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఇందులో గోమాంసం కూడా ఉన్నట్లు ఫోరెన్సిక్ పరీక్షల్లో నిర్ధారణైంది. కోల్డ్ స్టోరేజ్ మేనేజర్ అబ్దుల్ గఫూర్ ఈ మాంసం ఎగుమతి కోసం అక్రమంగా నిల్వ ఉంచినట్లు అధికారులు చెబుతున్నారు.
గోవు మాంసం ఎగుమతిపై నిషేధం ఉన్నందున ఏపీ కౌ స్లాటర్ నిషేధ చట్టం కింద కేసు నమోదు చేశారు. గేదె మాంసంగా తప్పుడు లేబులింగ్‌తో గల్ఫ్ దేశాలకు అక్రమంగా ఎగుమతి చేస్తునట్టు పేర్కొన్నారు. డీఆర్‌ఐ రైడ్‌ల అనంతరం కేసును పోలీసులకు అప్పగించగా.. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ విశాఖ పోలీస్ కమిషనర్‌తో మాట్లాడి స్మగ్లింగ్ నెట్‌వర్క్‌ను పూర్తిగా ఛేదించాలని ఆదేశించారు. ఈ ఘటనకు సంబంధించి కోల్డ్ స్టోరేజ్‌కు నోటీసులు జారీ చేసారు. కోర్టు ఆదేశాలతో మాంసాన్ని పూడ్చివేశారు. అయితే ఈ కోల్డ్ స్టోరేజి అధికార పార్టీ నేతది కావడంతో రాజకీయంగా కూడా వివాదం నెలకొంది.






