- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
స్థానిక సంస్థలకు 15వ ఆర్థిక సంఘం నిధుల విడుదల
by Malleboina Mahesh |
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి దిశగా ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది.

X
దిశ, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి దిశగా ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. 15వ ఆర్థిక సంఘం నిధుల కింద రూ.410 కోట్లు విడుదల చేస్తూ..పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. 2025–26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి మొదటి విడత అన్‌టైడ్ గ్రాంట్‌గా రూ.365 కోట్లు, అలాగే అదనపు నిధులుగా రూ.45 కోట్లు మంజూరు చేయడం జరిగింది. ఈ నిధులను గ్రామీణ స్థానిక సంస్థల అభివృద్ధి పనుల కోసం వినియోగించాల్సిందిగా సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ అయ్యాయి. ఈ నిధులతో గ్రామీణ మౌలిక సదుపాయాల విస్తరణ, తాగునీటి సదుపాయాలు, శానిటేషన్, రహదారులు, సామూహిక భవనాల అభివృద్ధి వంటి కార్యక్రమాలు చేపట్టనున్నారు. ప్రభుత్వం ప్రకటనతో స్థానిక సంస్థలు తమ అభివృద్ధి ప్రణాళికలను వేగవంతం చేయడానికి సిద్ధమవుతున్నాయి.
Next Story






