- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
వారికి రూ.15,000.. రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం
రాష్ట్రంలో ఎన్డీయే కూటమి ప్రభుత్వం(AP Government) అభివృద్దే లక్ష్యంగా, పలు అభివృద్ధి కార్యక్రమాల(Development programs)తో దూసుకెళ్తోంది.

దిశ,వెబ్‌డెస్క్: రాష్ట్రంలో ఎన్డీయే కూటమి ప్రభుత్వం(AP Government) అభివృద్దే లక్ష్యంగా, పలు అభివృద్ధి కార్యక్రమాల(Development programs)తో దూసుకెళ్తోంది. ఈ క్రమంలో సీఎం చంద్రబాబు(CM Chandrababu) ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం(Government) మరో కీలక నిర్ణయం తీసుకుంది. అసలు విషయంలోకి వెళితే.. సర్వీసులో ఉంటూ మరణించిన అంగన్‌వాడీ వర్కర్లు(Anganwadi workers), హెల్పర్ల అంత్యక్రియలకు(Helpers funeral) రూ.15 వేలు మంజూరు చేసే పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం పొడిగించింది. ఈ మేరకు రాష్ట్ర స్త్రీలు, పిల్లలు, వికలాంగులు & సీనియర్ సిటిజన్ల శాఖ(Senior citizens Department) కార్యదర్శి ఎ.సూర్యకుమారి ఈ రోజు(మంగళవారం) ఉత్తర్వులు జారీ చేశారు. మరణించిన అంగన్‌వాడీ వర్కర్ల, హెల్పర్లకు చెందిన చట్టబద్దమైన వారసులకు ఈ మొత్తం సొమ్మును చెల్లించాలని ఆ ఉత్తర్వుల్లో పేర్కొనడం జరిగింది.






