- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Modi: 15 నిమిషాలు మోదీ రోడ్‌షో.. గంట పాటు సభ
ప్రధాని నరేంద్ర మోదీ అమరావతి పర్యటన షెడ్యూల్ ఖరారైంది.

దిశ, డైనమిక్ బ్యూరో: ప్రధాని నరేంద్ర మోదీ అమరావతి (Amaravathi) పర్యటన షెడ్యూల్ ఖరారైంది. ఈ నెల 2న ఆయన అమరావతి రాజధాని పనులను పున:ప్రారంభించనున్నారు. ప్రధాని 2వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు గన్నవరం విమానాశ్రయానికి చేరుకుంటారు. హెలికాప్టర్ లో మధ్యాహ్నం 3.30 గంటలకు అమరావతిలోని హెలిప్యాడ్‌కు చేరతారు. అక్కడి నుంచి ప్రధాన వేదిక వరకు 1.1 కి.మీ. మేర రోడ్డు షోలో పాల్గొంటారు. 15 నిమిషాలపాటు రోడ్డు షో ఉంటుంది. 3.45 గంటల నుంచి 4 గంటల వరకు అమరావతి పెవిలియన్ ను సందర్శిస్తారు. సాయంత్రం 4 నుంచి 5 గంటల వరకు సభజరుగుతుంది. అమరావతి పునర్నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసిన అనంతరం సభలో ప్రసంగిస్తారు. 5.10 గంటలకు హెలికాప్టర్లో బయల్దేరి గన్నవరం విమానాశ్రయానికి చేరుకుంటారు. 5.20కి గన్నవరం నుంచి బయల్దేరి ఢిల్లీ వెళతారు. ప్రధాని సభ కోసం మూడు వేదికలు సిద్ధం చేస్తున్నారు. ప్రధాన వేదికపై ప్రధాని మోదీ, ముఖ్యమంత్రిచంద్రబాబు, (Chandrababu) ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సహా మొత్తం 20 మంది ఆసీనులవుతారు. మిగతా వీవీఐపీల కోసం మరో వేదిక ఏర్పాటు చేస్తారు. దానిపై 100 మంది ఉంటారు.
ఈ నేపథ్యంలో నేడు సీఎం చంద్రబాబు అత్యున్నత సమావేశం నిర్వహించనున్నారు. మోదీ పర్యటన ఏర్పాట్లపై ఈ సాయంత్రం ఆయన ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు. ఈడ సమీక్షకు సీఎస్, డీజీపీ, ఉన్నతాధికారులు హాజరవుతారు. వచ్చే నెల 2న రాజధానిలో రూ.లక్ష కోట్ల పైగా పనులకు శంకుస్థాపన చేసేలా ప్రణాళికలు రూపొందించారు.






